స్టాక్‌ మార్కెట్‌లో లాభాల జోష్‌...

899 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌..

స్టాక్‌ మార్కెట్‌లో లాభాల జోష్‌...

లోకల్ గైడ్:

భారత స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు కనిపించాయి. ట్రంప్‌ సుంకాల ఆందోళనలు ఓ వైపు ఉన్నా.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది వడ్డీ రేట్లలో కోత విధించే ఛాన్స్‌ ఉందన్న నేపథ్యంలో మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. భారత స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగో రోజు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లు కనిపించాయి. ట్రంప్‌ సుంకాల ఆందోళనలు ఓ వైపు ఉన్నా.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది వడ్డీ రేట్లలో కోత విధించే ఛాన్స్‌ ఉందన్న నేపథ్యంలో మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. గురువారం ఉదయం లాభాల్లో మొదలైన మార్కెట్లు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌75,917.11 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 460 పాయింట్లకుపైగా పెరిగింది. ఇంట్రాడేలో 75,684.58 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. గరిష్ఠంగా 76,456.25 పాయింట్లకు చేరి.. చాలారోజుల తర్వాత మరోసారి 76వేల మార్క్‌ను దాటింది.చివరకు 899.02 పాయింట్ల లాభంతో 76,348.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 283.05 పాయింట్ల లాభంతో 23,190.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో దాదాపు 2,296 షేర్లు లాభపడగా.. మరో 1,554 షేర్లు పతనమయ్యాయి. మెటల్, మీడియా, ఐటీ, ఎఫ్‌ఎంసిజి, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాల్టీ, టెలికాం వంటి అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం పెరిగాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ కంపెనీ, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి.

About The Author

Post Comment

Comment List

Latest News