టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు

టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు

లోకల్ గైడ్ తెలంగాణ,హనుమకొండ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రధాన  కార్యాలయంలో బుధవారం రోజు నిర్వహించిన  81వ పాలకవర్గ సమావేశంలో  టీజీ క్యాబ్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీలపై,టర్నోవర్స్, జిల్లాలోని డిసిసిబి బ్యాంకుల పని తీరు  పురోగతి పై, ఐటి రంగం, నెట్ వర్క్ పై, డిపాజిట్స్ ఎడ్యుకేషనల్ అవర్నెస్, ఆర్బీఐ, నాబార్డ్ సర్కులర్ల అమలుపై,వ్యవసాయ రుణాలు,రైతు రుణ మాఫీపై  సమీక్ష నిర్వహించారు. అనంతరం నూతనంగా నియమితులైన ఆర్సిఎస్ (రిజిస్ట్రార్ ఆఫ్ కో - ఆపరేటివ్ సోసైటీస్) సురేంద్ర మోహన్ ఐఏఎస్ ని రవీందర్ రావు  బోర్డు డైరక్టర్లతో కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సమావేశంలో డైరక్టర్లు, కుంభం శ్రీనివాస్ రెడ్డి, అడ్డి బోజా రెడ్డి, మామిల్లపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, దొండపాటి వేంకటేశ్వర రావు,కుంట రమేష్ రెడ్డి,ప్రొఫెషనల్ డైరక్టర్లు,శ్రీనివాసులు,మెహనయ్య, ఆర్సిఎస్ సురేంద్ర మోహన్ ఐఏఎస్, ఆడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు,నాబార్డ్ సిజిఏం ఉదయ్ భాస్కర్ ,టేస్కాబ్ సీజిఏం జ్యోతి , జిఏంలు సురేఖ,సుజాత,లత , బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు