స్త్రీ శక్తి.....

స్త్రీ శక్తి.....

స్త్రీ శక్తి
లోక‌ల్ గైడ్:
మహిళలను దేవత రూపంలో 
పూజించే సంస్కృతి మనది
స్త్రీ కన్నెరజేస్తే కాళికల
భగ భగ మండే ఆది పరాశక్తిలా 
దర్శనమిస్తుంది..... 

యుద్ధ సమయంలో స్త్రీయే కదా అని
చులకనగా చూస్తే శత్రువుల గుండెలో
పరుగులు పెట్టించిన ఘనత చరిత్ర
తెలుపుతుంది..... 

స్వాతంత్ర్య స్వగ్రామంలో
జాన్సీ లక్ష్మి భాయ్ మొదలు 
సామాజికకోద్యమాలు 
చాకలి ఐల్లమ్మ వరకు చరిత్ర గాంచిన 
వీర వనితలు నేటికి ఆదర్శం..... 

మానవ జాతి మనుగడకు
స్త్రీ కావాలి 
ఓ అమ్మలా, తోబుట్టువుగా, సహౕచారిగా
ఉంటు నిరంతరము సేవలు అందిస్తూ 
ఇంట్లో వెలుగులు నింపుతుంది...... 

మహిళ అంటే విపత్కర పరిస్థితిలో 
వీర నారిలా, ఆపద సమయంలో 
మదర్ థేరిసాలా, శుభ సమయంలో 
ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ
వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది.... 

కుటుంబ వ్యవస్థను
సాంస్కృతిక సంప్రదాయాలను
కాపాడుతూ దేశ ఔనత్యాన్ని
ప్రపంచ దేశాలకు చాటుతుంది.

         మిద్దె సురేష్
        కవి, వ్యాసకర్త
         9701209355

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి  నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి 
  లోకల్ గైడ్ తెలంగాణ , వరంగల్ జిల్లా ప్రతినిధి : నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు లో ఓ వెంచర్ దగ్గర  ఉద్రిక్తత చోటుచేసుకుంది.భూమి మాది
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ "చిన్న జీయర్ స్వామి" వారి ఆశీస్సులు తీసుకున్న అశోక్ సాదుల...
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలి ...
దివ్యాంగులకు యూనిక్ డిజిటబులిటీ ఐడి కార్డు జారీ పై అపోహలు వద్దు 
అంగన్వాడి కేంద్రాలకు ఒక్కపూట బడులు అమలుచేయాలి
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి