జగత్తు సృష్టిలోనే గొప్ప సృష్టి మహిళ
- ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు.
- మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించాలి.
- మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట.
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.
- ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
లోకల్ గైడ్/తాండూరు:
జగత్తు సృష్టిలోనే గొప్ప సృష్టి మహిళా అని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్విఆర్ గార్డెన్స్ లో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో గల మహిళ ప్రజాప్రతినిధులు, ఐసీడీఎస్, ఐకేపీ, పోలిస్, ఫారెస్ట్, ఆర్టీసీ,విద్య, వైద్యం, రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగస్థులు పాల్గొనడం జరిగింది. కాగా నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళ ఉద్యోగస్థులందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి మహిళలు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో మహిళలు అంటే వంటింటికే పరిమితం అనే నానుడి నుండి, నేడు అవకాశాలు రావాలి కానీ, భూమ్మీదే కాదు..ఆకాశం, సముద్రంలో కూడా సత్తా చాటేందుకు నేటి మహిళలు సిద్ధమవుతున్నారు.ఎక్కడైతే మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు కొలువైతారని అన్నారు.నింగి, నేల అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో పురుషుల కంటే ఎక్కువే రాణిస్తూ, ఈ దేశం సాధించే ప్రగతిలో, విజయంలో తమ వంతు పాత్ర పోషించడంలో మహిళలు ఉన్నారు.మహిళలకు అవకాశం కల్పిస్తే అద్బుతాలు సృష్టితారనే నమ్మకంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు.ప్రభుత్వం ఏర్పాటు అయిన సంవత్సరంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి" ద్వారా స్వయం సహాయక సంఘాలకు తొలి విడతగా 150 బస్సులను అద్దెకు ఇచ్చే వినూత్న కార్యక్రమాన్ని “ప్రపంచ మహిళా దినోత్సవం” రోజున అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని, రాష్ట్ర ప్రతిష్ఠను దశదిశలా వ్యాప్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి, రాష్ట్ర ప్రతిష్ఠను దశదిశలా వ్యాప్తిచేయాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అనంతరం కార్యక్రమానికి హాజరైన మహిళలకు శాలువా మెమెంటో తో సత్కరించి మహిళలందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Comment List