భవనాల మంజూరు ఇక నుండి వేగవంతం: కమీషనర్ ఇలంబర్తి
లోకల్ గైడ్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక నుండి భవన నిర్మాణాల అనుమతులు వేగవంతంగా జరుగుతాయని జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి అన్నారు.గురువారం జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫీషియల్ Intelligence టెక్నాలజీ రూపొందించిన బిల్డ్ నౌ పై జోనల్, డిప్యూటీ కమిషనర్ లకు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ... బిల్డ్ నౌ అప్లికేషన్ అప్లోడ్ చేసే విధానం పై పలువురికి శిక్షణ కల్పించినట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని మార్చి 9 వరకు నిర్వహించి, మార్చి 10వ తేదీ నుండి బిల్డ్ నౌ అప్లికేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నందున జిహెచ్ఎంసి జోనల్, డిప్యూటీ కమిషనర్ లకు బిల్డ్ నౌ అప్లికేషన్ అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్ Intelligence టెక్నాలజీ తో రూపొందించబడిన నేపథ్యంలో ప్లాన్ లో అప్లోడ్ చేసే సమయంలో అందులో ఉన్న లోపాలను గుర్తిస్తుందని, మొత్తం ప్లాన్ మొదటి నుండి పరిశీలించాల్సిన అవసరం ఉండదని, గుర్తించిన అంశాన్నే సవరించి అప్లోడ్ చేసే వెసులుబాటు ఉందని అన్నారు. అప్లికేషన్ పరిశీలన చేసే సందర్భంలో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గా ప్లాన్, చెరువు పక్కన ఎంత దూరంలో ఉంది, కోర్టు కేసులు ఉన్నాయా అప్లికేషన్ లోనే పొందుపర్చడం జరుగుతుందని వివరించారు. వాటిని పరిశీలించి తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుందని సైట్ కూడా పరిశీలన చేసే అవకాశం కలదన్నారు. అప్లై చేసే వారు చివరగా కోర్టు కేసులు గాని, ఇతర ఎలాంటి కేసులు లేవని ఏదైనా సమస్య ఉంటే మొత్తానికి నేనే బాధ్యత వహిస్తానని ధృవీకరణ సమర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో సి సీ పీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంత్, హేమంత్ కేశవ్ పాటిల్, ఎపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, వెంకన్న, అడిషనల్ సి సీ పీ లు గంగాధర్, ప్రదీప్ వీరన్న టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
Comment List