కుంగ్ ఫు పోటీల్లో షాద్ నగర్ ఆక్సిఫోర్డ్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

కుంగ్ ఫు పోటీల్లో షాద్ నగర్ ఆక్సిఫోర్డ్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

లోకల్ గైడ్ :షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రామిరెడ్డి గార్డెన్లో యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన 38వ ఆల్ ఇండియా లెవల్ ఓపెన్ కరాటే, కుంగ్ ఫు ఛాంపియన్‌షిప్ 2025 టోర్నమెంట్‌లో షాద్ నగర్ పట్టణానికి చెందిన ఆక్సిఫోర్డ్ హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.న్యూ పవర్ కుంఫు అకాడమీ మాస్టర్లు బాలరాజ్, హైమ్మద్ ఖాన్ మార్గదర్శకత్వంలో పోటీల్లో పాల్గొన్న ఈ విద్యార్థులు స్పైరింగ్ విభాగంలో అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా, ఎండీ. ఫరకన్ అలీ తన ప్రతిభను చాటుకుని గోల్డ్ మెడల్ గెలుచుకుని ప్రశంసలు అందుకున్నాడు.ఈ సందర్భంగా పాఠశాల యజమానులు రిజ్వాన్ విద్యార్థిని ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా, ఫరకన్ తండ్రి రహమాత అలీ కూడా తన కుమారుడిని అభినందించి, తల్లిదండ్రులుగా పిల్లల్ని క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహించాలని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News