ప్రజావాణి జన ప్రభంజన వేదిక: చిన్నారెడ్డి
లోకల్ గైడ్: ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం జన ప్రభంజన వేదిక అని అలాంటి గొప్ప కార్యక్రమం పై బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు బురద చల్లడం ఏమాత్రం సబబు కాదని, హరీష్ రావు ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. సచివాలయ మీడియా సెంటర్లో ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడారు.ప్రజావాణి కార్యక్రమంపై బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పనిగట్టుకొని బురద చల్లుతున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. హరీష్ రావు పట్ల ఉన్న కాస్త గౌరవం కూడా మంట కలిసి పోతుందని, ప్రజల సమస్యలు వినే గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని, ప్రజావాణిపై విమర్శలు చేయడం హరీష్ రావుకు తగదని, హరీష్ రావు ఇదేం పద్ధతి అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.ప్రజల కష్టాలు విని, వారి నుంచి అర్జీలను స్వీకరించి మేలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమంపై విమర్శలు చేస్తే హరీష్ రావుకు పాపం తగులుతుందని, చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రజావాణి మాపై, సిబ్బందిపై విమర్శలు చేయడం మానుకోవాలని చిన్నారెడ్డి సూచించారు.హరీష్ రావు వీలు చేసుకుని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి స్వయంగా చూడాలని, అప్పుడు ప్రజావాణి సిబ్బంది, తాము చిత్తశుద్ధితో చేస్తున్న కష్టం గురించి తెలుస్తుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల సమస్యలను విని పరిష్కారం చూపుతున్నామని, వారానికి రెండు సార్లు మంగళ , శుక్రవారాలలో ప్రజావాణి కార్యమం నిర్వహిస్తున్నామని చిన్నారెడ్డి తెలిపారు.ఈ లెక్కన 92 శేషన్స్ ద్వారా 92, 115 అర్జీలను స్వీకరించి అందులో 63 శాతం సమస్యలను పరిష్కారం చేశామని చిన్నారెడ్డి తెలిపారు.2023 డిసెంబర్ 8 న ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రారంభించారని, ఈ ప్రాంగణాన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ అని నామకరణం చేశారని చిన్నారెడ్డి గుర్తు చేశారు. ఇనుప సంకెళ్లను కూల్చి సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ప్రజా భవన్ కు వచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా భవన్ ను తీర్చి దిద్దారు అని చిన్నారెడ్డి వివరించారు.
Comment List