శనీశ్వరుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
శనీశ్వరుని దయ వల్లనే వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నాను
లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా:- మోమినిపేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో వెలిసిన శనీశ్వరునికి శని త్రయోదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు తైలాభిషేకాలు నిర్వహించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనీశ్వరుని దయ వల్లనే చేవెళ్ల నుండి ప్రతిసారి ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నానని. అందుకే నేను శని అమావాస్యకు శని త్రయోదశి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు తైలాభిషేకాలు నిర్వహించి శనీశ్వరునికి కృపకు పాత్రుని నవ్వుతున్నానని ఆయన అన్నారు. శని త్రయోదశి పురస్కరించుకొని దేవాలయంలో కర్ణాటక రాష్ట్ర ప్రధాని ప్రచారం గ్రామానికి చెందిన కస్తూరి రాంరెడ్డి తనయులు కస్తూరి వెంకట్ రెడ్డి కస్తూరి గోపాల్ రెడ్డి కస్తూరి శ్రీనివాసరెడ్డిలు శనేశ్వరుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు శనేశ్వరునికి అన్న ప్రసాదవితరణ కార్యక్రమంలో పాల్గొంటామని మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోష దాయకంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మార్గశిర మాసంలో చివరి నెలలో శని త్రయోదశి సందర్భంగా వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు తైలాభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు శనేశ్వరుని కృప ఉంటే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేక పూజ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ హనుమంతరావుడిఎస్పి శ్రీనివాస్ రెడ్డి. నవాబుపేట మాజీ జెడ్పిటిసి రామ్ రెడ్డి వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శనీశ్వరుని కృపకు పాత్రులు అయ్యారు.
Comment List