అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ { ఏ ఎస్ డబ్ల్యూ ఓ} ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.
నల్లగొండ జిల్లా బ్యూరో.
లోకల్ గైడ్:
స్థానిక నల్గొండ హైదరాబాదు రోడ్లో గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ { ఏ ఎస్ డబ్ల్యూ ఓ టి మ్ } వారి ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్రం వద్ద సోమవారం అన్వి ఫౌండేషన్ చైర్మన్ ఇటికాల శ్రీకాంత్ సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇటికాల శ్రీకాంత్, సోషల్ యాక్టివిస్ట్ సాదిక్ పాషా లు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ రోజు చల్లని నీటితోపాటు వారానికి ఒకసారి మజ్జిగ పంపిణీ చేయడానికి సహకరిస్తున్న ఏ ఎస్ డబ్ల్యూ ఓ టీం కి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో తమ వంతుగా సహకారం అందించిన ఇటికాల శ్రీకాంత్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సాదిక్ పాషా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురాంరెడ్డి, పాలకూరి నర్సింహా గౌడ్, అయితరాజు ప్రసాద్, చర్లపల్లి అశోక్, ఇటికాల సైదులు, దోనాల లింగారెడ్డి, దేప నవీన్ రెడ్డి, కట్టెబోయిన సంజీవ యాదవ్, మందడి రామ్ రెడ్డి, యలిజాల శంకర్, తుమ్మలపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List