పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
లోకల్ గైడ్ :
జిల్లా పోలీస్ శాఖలో నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్లో హోమ్ గార్డ్ గా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందుతున్న ఆర్.వెంకటేశ్వర్లు ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా యస్.పి ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ శాఖ లో హోమ్ గార్డ్ గా 33 సంవత్సరాల పాటు సేవలందిస్తూ పదవి విరమణ పొందడం అభినందనీయం అని అన్నారు.మీరు పోలీస్ శాఖలో అందించిన సేవలు అనుభవాలు చాలా అవసరం ఉంటాయని అన్నారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.అనంతరం కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకుని పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్,హోమ్ గార్డ్ ఆర్. ఐ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్. ఐ సంతోష్, ఆర్.యస్.ఐ శ్రావణి హోమ్ గార్డ్ కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు
Comment List