లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు
వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి.
ప్రభుత్వం స్పందించకుంటే లబ్ధిదారులచే ఆక్రమింప చేస్తాం.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి.
(లోకల్ గైడ్ తెలంగాణ)
నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపిక చేసిన 552 డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని లేనియెడల లబ్ధిదారులచే ఆక్రమింప చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.
సోమవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ఇండ్లు మౌలిక సదుపాయాలు కల్పించకుండానే లాటరీ ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎంపికైన లబ్ధిదారులకు స్వాధీనపరచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గత ఐదు నెలలుగా పోరాట కమిటీ ఏర్పాటు చేసుకొని వివిధ రూపాలలో ఆందోళన చేసి తాసిల్దార్ ఆర్డీవో కలెక్టర్ వివిధ అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ దీక్షలు 25 వరకు కొనసాగుతాయని అప్పటివరకు అధికారులు స్పందించి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అన్నారు. లేనియెడల లబ్ధిదారులతో కలిసి ఆక్రమింప చేస్తామని పోలీసుల కేసులకైనా లాటీలకైనా బెదిరేది లేదని హెచ్చరించారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ మాట్లాడుతూ సోమవారం నుండి శుక్రవారం వరకు వార్డుల వారీగా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని అన్నారు. రెండవ రోజు 11వ వార్డు నుండి 20వ వార్డువరకు, మూడో రోజు 21 నుండి 30 వరకు, 4వ రోజు 31 నుండి 40 వరకు 5వ రోజు 41నుండి 48 వరకు తాసిల్దార్ కార్యాలయం జరిగే దీక్షలకు ఆయా వార్డు ల లబ్ధిదారులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఈ దీక్షల లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, దండెంపల్లి సరోజ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, పాల్గొని మద్దతు ప్రకటించారు.మొదటిరోజు దీక్షలలో పోరాట కన్వీనర్ ఆవుట రవీందర్ సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోరాట సాధన కమిటీ సభ్యులు పగిళ్ల శ్రీను అండేకార్ రజిని, పార్వతి, గోలి సుజాత, సుంఖీశాల చెన్నకేశవులు, లతీఫ్ ఖాజా మొయినుద్దీన్ ఎండి జాంగిర్ తదితరులు పాల్గొన్నారు.
Comment List