దళిత రత్న అవార్డు అందుకున్న కాశపోగు జాన్
గద్వాల (లోకల్ గైడ్): ప్రభుత్వం ఎస్సీ షెడ్యూల్ కులాలు మహనీయుల జయంతుల ఉత్సవాల సందర్భంగా 2025 అవార్డులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా దళితరత్న అవార్డుకు దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్ లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు మాదిగ చేతుల మీదుగా బుధవారం హైదరాబాదులో కాశపోగు జాన్, డేవిడ్ లు దళిత రత్న అవార్డును అందుకున్నారు. దళితులను ఐక్యం చేయడంలో తమ వంతు పాత్ర పోషించిన కాశపోగు జాన్, డేవిడ్ లకు దళిత రత్న అవార్డు రావడం అభినందనీయమని పలువురు దళితులు కొనియాడారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీతలు కాశపోగు జాన్, డేవిడ్ లు మాట్లాడుతూ... దళిత రత్న అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దళిత జర్నలిస్టులను ఐక్యం చేయడం, వారి హక్కులను సాధించడమే తమ ధ్యేయమన్నారు. అవార్డు రావడం పట్ల మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. దీంతో వారు ప్రభుత్వానికి, జయంతి ఉత్సవాల వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు మాదిగ, దళిత సంఘాల నాయకులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comment List