రాయల్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు :  కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాధ్ 

రాయల్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు :  కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాధ్ 

లోకల్ గైడ్ తెలంగాణ, అల్వాల్ : మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని రాయల్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని స్ధానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాధ్ అన్నారు. మంగళవారం రాయల్ ఎన్ క్లేవ్  రోడ్ నెంబర్ 2 కాలనీ వాసులు కార్పొరేటర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమ కాలనీ లోని ఈ రోడ్డుపై గత కొంత కాలంగా నీళ్లు నిలిచి, రోడ్డు గుంతలు పడి అధ్వాన్నంగా మారిందని, సీసీ రోడ్ వేయించాలని కోరారు.దీనికి కార్పొరేటర్ సానుకూలంగా స్పందించారు. త్వరలో  ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మీ కాలనీలో పర్యటించి ప్రతిపాదనలు తయారు చేసి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు పంపి సమస్య పరిష్కారం చేస్తానని హమీనిచ్చారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News