అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్

అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్

లోకల్ గైడ్ మేడ్చల్

అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ పట్టణం లోని  అంబేద్కర్ విగ్రహానికి బి ఆర్ టి యు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంబు ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు.అంబేద్కర్ చేసిన సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం జరుగుతుందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యమేన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ 3వ వార్డు బి ఆర్ ఎస్ నాయకుడు రాజ్ కుమార్, నాయకులు గడ్డం నర్సింగ్ రావు, ఎర్రోళ్ల దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News