ఎస్పీ కార్యాలయంలో ఘనంగా డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి
అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు
లోకల్ గైడ్ ప్రతినిధి:
భారత రాజ్యాంగ నిర్మాత,దళిత హక్కులకు మార్గదర్శకుడు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ రోహిత్ రాజు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్యం నుండే కులవ్యవస్థను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రముఖ భారతీయ న్యాయవాదిగా,ఆర్థిక శాస్త్రవేత్తగా,రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా అంబేద్కర్ ఎదిగారని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని,విదేశాలలో విద్యను అభ్యసించి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా అతి పెద్ద ప్రజస్వామ్య భారత రాజ్యాంగాన్ని తన ఆద్వర్యంలో రచించి దిశానిర్దేశం చేశారని అన్నారు.స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా,బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి నేటి యువతకు అదర్శంగా నిలిచిన మహానీయుడని కొనియాడారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఎస్బి ఇన్స్పెక్టర్స్ నాగరాజు,శ్రీనివాస్, సీఐలు వెంకటేశ్వర్లు,కరుణాకర్,రమేష్,శివ ప్రసాద్,ఆర్ఐలు సుధాకర్,నరసింహారావు,లాల్ బాబు మరియు ఎస్సైలు నరేష్,రమణా రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List