భారత రాజ్యాంగo పూర్తి స్థాయి అమలు కై పోరాడుదాం
వనపర్తి టీజేఎస్ అధ్యక్షులు
యంఏ ఖాదర్ పాష
లోకల్ గైడ్ : ఎన్నో అధ్యయనాలతో ప్రజాస్వామిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కొరకు రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాలకవర్గాలు అమలు చేయడం లేదని ఆ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయుట కొరకు పోరాటాలు తీవ్రం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని.. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు .భారత రాజ్యాంగం పెను ప్రమాదం ఎదుర్కోబోతున్నదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఇప్పటికే రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు చేస్తూనే రేపు పూర్తిస్థాయిలో మార్చడానికి సన్నద్ధమవుతుందని భారత ప్రజలైన మనం తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు టి జేఏసీ. కన్వీనర్ రాజారాం ప్రకాష్. సీనియర్ న్యాయవాది మాజీ బార్ అధ్యక్షులు సి మోహన్ కుమార్ యాదవ్.. జన సమితి పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు శాంతారావు నాయక్ . చంద్రశేఖర్ నరసింహులు మైనార్టీ నాయకులు బాలేమియా తదితరులు పాల్గొన్నారు.
Comment List