ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్!..

ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ మరో రికార్డ్!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ టి20 లీగ్ లో మరో రికార్డ్ సృష్టించాడు. నిన్న రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు  విరాట్ కోహ్లీ 67 పరుగులు చేసి టి20 లో 13 వేల పరుగులను  పూర్తి  చేసుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 386 ఇన్నింగ్స్లలో విరాట్ కోహ్లీ ఈ రికార్డును సాధించగా అతనికంటే ముందు పోలార్ (13537), షోయబ్ మాలిక్  ( 13,557 ), హేల్స్ (13610) టాప్ లో ఉన్నారు. అయితే వీళ్ళందరి కన్నా మొదటి స్థానంలో ఉన్న క్రిస్ గేల్  ( 14,562 ) పరుగులు చేశారు.  విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాట్స్మెన్గా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్లో ఆర్సిబి బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఐపీఎల్ లో సరికొత్త రికార్డును సృష్టించాడు. ఐపీఎల్ మెగా టోర్నీలో  అత్యధిక వికెట్లు తీసిన ఫేస్ బౌలర్గా నిలిచారు. ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ 179 మ్యాచులు ఆడగా 184 వికెట్లు తీశారు. ఆ తరువాత స్థానాల్లో  బ్రావో  (183), మలింగ (170), బుమ్రా  (165) టాప్ లో నిలిచారు. ఇక వీళ్ళందరి కంటే  అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు జాబితాలో మొదటి స్థానంలో చాహల్  (206) వికెట్లతో ఉన్నారు. 6370388090112-1742665243

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News