కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని!... జట్టుపై తీవ్ర విమర్శలు?

కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని!... జట్టుపై తీవ్ర విమర్శలు?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా  మరోసారి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించనున్నారు.  ప్రస్తుతం చెన్నై జట్టుకు సారధిగా ఉన్న రుతిరాజ్ గైక్వాడ్ కు మోచేతి గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నారు. దీంతో ధోని మళ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తారని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోచ్  ఫ్లెమింగ్  కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కాగా ఈ సీజన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అంతగా అదృష్టం కలిసి రావడం లేదు. ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించారు. దీంతో చెన్నై జట్టుపై విపరీతమైన  ట్రోల్ల్స్  వస్తున్న నేపథ్యంలో.. మళ్లీ మహేంద్రసింగ్ ధోనీ నీ కెప్టెన్గా నియమించారు. మరి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ లో ఇప్పటికే ఐదు ఐపీఎల్ ట్రోఫీలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో మళ్లీ ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పుంజుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయితే మరోవైపు కెప్టెన్ గా  రుతురాజు గైక్వాడ్ ను తప్పించడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాయం కారణమని చెప్పి కావాలనే  రుతురాజును కెప్టెన్ బాధ్యతల నుండి తప్పించారని విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడం చాలా మంచిది అని... నిజంగానే రుతురాజ్ కు గాయమైందని  కామెంట్ చేస్తున్నారు. 

usj5naf_ms-dhoni-ruturaj-gaikwad-bcci_625x300_10_April_25

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News