హైదరాబాద్ వాసులు జాగ్రత్త.... వేళల్లో కోళ్లు మృతి

హైదరాబాద్ వాసులు జాగ్రత్త.... వేళల్లో కోళ్లు మృతి

లోకల్ గైడ్, తెలంగాణ :-  తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఒక కోళ్ల ఫారంలో మూడు రోజుల క్రితం వేలాది కోళ్లు మరణించాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ వేల సంఖ్యలో మరణించిన కోళ్లు అన్ని కూడా బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించాయని  అధికారులు తెల్చి చెప్పారు. ఆ పౌల్ట్రీ లోని కోళ్లు గాని లేదా కోడిగుడ్లు గాని ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో అమ్మవద్దని కోళ్ల ఫామ్ యాజమాన్యానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరూ కూడా వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రతి ఒక్కరు కూడా చికెన్ ను లేదా కోడి గుడ్డును బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలని అధికారులు సూచనలు చేశారు. కాగా ఇప్పుడిప్పుడే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా... ఎక్కడ ఈ వ్యాధి సోకుతుందో అని చికెన్ తినడం కూడా చాలామంది మానేశారు. అయితే మరి కొంతమంది మాత్రం అధికారులు తినమంటున్నారు కదా అని ధైర్యం చేసి మరి తింటున్నారు.  అయితే తాజాగా వచ్చిన ఈ వార్తను విన్నా చాలా మంది ప్రజలు మళ్లీ చికెన్ తింటే ఏ ప్రాబ్లం వస్తుందో అని భయపడిపోతున్నారు. కానీ ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా మనుషులకు ఏమి కాదని... బాగా ఉడికించిన తర్వాతే చికెన్ తినాలని చెప్తూ.. అధికారులు ప్రజల్లోని భయాన్ని పోగొడుతున్నారు. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగానే ఉన్నాయి.  

images (18)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం