మూగ జీవాలను సజీవ దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి.

మూగ జీవాలను సజీవ దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

లోకల్ గైడ్ తెలంగాణ:

ఖిలావరంగల్ మండలంలోని ఖిలా వరంగల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న గొర్రెల శాలను గురువారం రాత్రి దుండగులు కాల్చివేసిన స్థలాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి పరిశీలించారు. అనంతరం మేకల రవి మాట్లాడుతూ మూగజీవాలైన సుమారు 400 గొర్రెలను సజీవ దహనం చేయడం ఘోరమైన చర్యగా పేర్కొన్నారు. బాధిత కుటుంబం సుమారు 50 లక్షల వరకు నష్టపోవడం జరిగిందని తెలిపారు. దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.బాధిత కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం 30 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని లేకుంటే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉందని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  పనాస ప్రసాద్ సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, సంగి ఎలేందర్ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు,రాచర్ల రాజేందర్ డి హెచ్ పి ఎస్ ఖిలా వరంగల్ మండల కార్యదర్శి, నాయకులు మంద నవీన్,ఠాకూర్,సునీత  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం