నేడే 10వ తరగతి వార్షిక పరీక్షలు
పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.
జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, ఐపీఎస్
లోకల్ గైడ్ తెలంగాణ:
నేడే 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న జిల్లాలోని విద్యార్థులందరికీ జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరూ గుంపులు గుంపులుగా గుమిగూడి ఉండకూడదు, పరీక్షా కేంద్రాల లోపలికి సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు పరీక్షా సమయంలో మూసివేయాలి. ఎవరైనా పరీక్షా కేంద్రాల దగ్గర చట్టవిరుద్ధమైన పనులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.ఎస్పీ గారు విద్యార్థుల గురించి మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని, విద్యార్థులందరూ సమయపాలన పాటిస్తూ ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని, ఎక్కడ ఎవరికైనా ట్రాఫిక్ ఇబ్బందులు కలిగితే డయల్ 100కి కాల్ చేసి పోలీసు అధికారులకు తెలియజేయాలని ఎస్పీ గారు తెలిపారు.
Comment List