మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమివ్వడం తెలంగాణకు గర్వకారణం
తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే సువర్ణావకాశం
అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలి
రాజకీయ కోణంలో మిస్ వరల్డ్ పోటీలను చూడటం సరికాదు
మిస్ వరల్డ్ ప్రి ఈవెంట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు
లోకల్ గైడ్, హైదరాబాద్:
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిధ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని, ప్యూచర్ సిటిగా ఎదుగుతున్న విశ్వనగరం హైదరాబాద్.. ఈ ఈవెంట్ కు వేదికగా నిలవడం గర్వంగా ఉందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బేగంపేట్ టూరిజం ప్లాజాలో గురువారం మిస్ వరల్డ్ పోటీలకు చెందిన ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు, టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, పర్యాటక అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అతిధులకు వేద మంత్రాలతో పూర్ణకుంభం స్వాగతం పలికారు. అనంతరం విగ్నేశ్వర పూజ చేసి, అతిధులందరికి వేదాశీర్వచనం చేశారు.ప్రారంభంలో పేరిణి నాట్య కళాకారులతో హరతినిచ్చి, తిలకధారణతో పలికిన ఆహ్వానం అందరిని ఆకట్టుకుంది. ఫిలిగ్రి వెండి వస్తువులు, చేర్యాల నఖాషి చిత్రాలను కళాకారులు ప్రదర్శించారు. ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాలను అక్కడిక్కడే మగ్గంపై నేసి చూపించడం అంతర్జాతీయ మీడియాకు అదనపు ఆకర్శణగా నిలిచింది. తెలంగాణ పర్యాటక శాఖ వెబ్ సైట్ ను ఈ సందర్బంగా ఆవిష్కరించారు.
Comment List