అర్హత కలిగిన దివ్వంగులకు ఉచిత ఉపకరణాలు దివ్వంగులు అంచనా శిబిరాలకు  హాజరు కావాలి 

 అసిస్టెంట్ కలెక్టర్ సంక్షేమ అధికారి ఉమా హారతి 

అర్హత కలిగిన దివ్వంగులకు ఉచిత ఉపకరణాలు దివ్వంగులు అంచనా శిబిరాలకు  హాజరు కావాలి 

 లోకల్ గైడ్ వికారాబాద్ :-
మార్చి 03 నుండి నుండి మార్చి 05  వరకు 3 రోజుల పాటు దివ్యాంగుల అంచనా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు అసిస్టెంట్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఉమా హారతి ఒక ప్రకటనలో తెలిపారు.  వికారాబాద్ ధర్మ విద్యాలయం శిబిరానికి ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వ  ఎడిఐపీ పథకం కింద గుర్తించబడిన మరియు అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచితంగా సహాయాలు,  ఉపకరణాలను అందించడం కోసం వికారాబాద్ జిల్లాలో భారత ప్రభుత్వ  ఎడీఐపి పథకం కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ , హ్యాండ్ ప్రొపెల్డ్ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, హియరింగ్ ఎయిడ్స్ వంటి సహాయక పరికరాలను సూచించడానికి 03 రోజుల శిబిరాలను నిర్వహించడం జరగుతుంది కావున పైన పేర్కొన్న తేదీలలో ఆసక్తి గల దివ్యాంగులు శిబిరాలకు హాజరు కావాలన్నారు. వైకల్య ధృవీకరణ పత్రం అన్ని సహాయాలు,  ఉపకరణాలకు కనీసం 40 శాతం వైకల్యం తప్పనిసరి కలిగి ఉండాలని, సంబంధిత దివ్యాంగ కాబోయే లబ్దిదారుడు లేదా వారి సంరక్షకుల అన్ని వనరుల నుండి నెలవారీ ఆదాయం 22,500 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లు చూపించే ఆదాయ రుజువు కాపీ కలిగి ఉండాలని ఆమె తెలిపారు.  ప్రభుత్వం అధికారి,  ఎమ్మెల్యే, ఎంపీ ధ్రువీకరణ లేదా బిపిఎల్ రేషన్ కార్డ్ లేదా దివ్యాంగ పెన్షన్ రుజువు ద్వారా జారీ చేయబడి ఉండాలని తెలిపారు. దివ్యాంగ జన ఆధార్ కార్డు కాపీ.ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కలిగి ఉండాలని ఆమె తెలిపారు.సమాచారం నిమిత్తం   8179432874 ఫోన్ నెంబర్ ను సంప్రదించాల్సిందిగా అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు.ఇది సదరం క్యాంపు కాదని,  ఇక్కడ ఎటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వబడవు. సర్టిఫికెట్స్ ఉన్నవారికి ఉచితంగా సహాయాలు మరియు అందించడానికి రిజిస్ట్రేషన్ చేసే క్యాంపుగా గుర్తించాలని ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు