ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని  సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని  సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

లోకల్ గైడ్,హనుమకొండ జిల్లా ప్రతినిధి: సుబేదారిలోని  కాకతీయ బాలికల  జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన  ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సోమవారం సందర్శించారు. ఈ పరీక్ష కేంద్రంలో  ఏర్పాట్లను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏర్పాట్లను గురించిన వివరాలను స్థానిక అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష జరుగుతున్న తీరును కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య వివరాలను, పరీక్షల  నిర్వహణకు సంబంధించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనసాగుతున్న ఇంటర్మీడియట్  పరీక్షలను పరీక్షా కేంద్రంలో  ఎలాంటి లోటుపాట్లు లేకుండా  పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి  నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి 
  లోకల్ గైడ్ తెలంగాణ , వరంగల్ జిల్లా ప్రతినిధి : నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు లో ఓ వెంచర్ దగ్గర  ఉద్రిక్తత చోటుచేసుకుంది.భూమి మాది
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ "చిన్న జీయర్ స్వామి" వారి ఆశీస్సులు తీసుకున్న అశోక్ సాదుల...
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలి ...
దివ్యాంగులకు యూనిక్ డిజిటబులిటీ ఐడి కార్డు జారీ పై అపోహలు వద్దు 
అంగన్వాడి కేంద్రాలకు ఒక్కపూట బడులు అమలుచేయాలి
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి