ప్రీమియర్ షోలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు..
లోకల్ గైడ్:
తెలంగాణలో బెనిఫిట్,ప్రీమియర్ షోలకు సంబంధించి హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెల్లడించింది.తెలంగాణలో బెనిఫిట్ షోలు,ప్రీమియర్ షోలకు సంబంధించి హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెల్లడించింది.తెలంగాణలో ప్రీమియర్,బెనిఫిట్ షోలకు అనుమతి లేదని హైకోర్టు మరోసారి తెలిపింది.జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను నేడు సవరించిన హైకోర్టు ప్రీమియర్,బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించింది.అలాగే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.మరోవైపు 16 ఏండ్ల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం..అర్థరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 వరకు గల మధ్య సమయంలో ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని..ఈ చట్టాన్ని పాటించాలని న్యాయస్థానం గత నెల ప్రభుత్వాన్ని ఆదేశించింది.పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది.హైకోర్టు ఆదేశాలు అలాగే ప్రభుత్వ నిర్ణయం ద్వారా బెనిఫిట్ మరియు ప్రీమియర్ షోలపై నిషేధం విధించింది.
Comment List