కార్మిక సమస్యలను పరిష్కరించాలి:రజాక్
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి (లోకల్ గైడ్): కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ సత్తుపల్లి జె.వి.ఆర్ ఓసి గని మేనేజర్ రాజేశ్వరరావును కోరారు. జె.వి.ఆర్ ఓసి లో ఈపి ఆపరేటర్లు సర్వేడ్ ఆఫ్ దగ్గర్లో ఉన్న డంపర్లు నడపడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని చర్చించారు. నూతనంగా హెచ్.ఈ.ఎం.ఎం మిషనరీ కొనుగోలు చేయాలని కోరారు. ఐ.ఈ.డి నాన్స్ ప్రకారం మ్యాన్ పవర్ సర్దుబాటు చేయాలని ,సూపర్వైజర్ స్టాప్ పలు సమస్యల పరిష్కరించాలని,మహిళ ఉద్యోగులకు రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయాలని,సి.హెచ్.పి లో డస్ట్ నియంత్రణ చర్యలు చేపట్టాలని,క్రషర్స్ క్యాబిన్స్ మరమ్మతులు చేపించాలని, యాక్టింగ్ చేసే ఉద్యోగులకు యాక్టింగ్ మాస్టర్ వచ్చే విధంగా చూడాలని, ఉద్యోగులకు వాటర్ బాటిల్స్ ఇప్పించాలని తదితర సమస్యలపై దానిమీదలతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేనేజర్ పై అధికారుల దృష్టి తీసుకెళ్లి త్వరగా పూర్తయ్యే విధంగా చూసుకుని,హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో చెన్నకేశవరావు(జి.ఎం చర్చల ప్రతినిధి )గౌస్(బ్రాంచ్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ),తీగల క్రాంతి కుమార్ ( బ్రాంచ్ సెక్రటరీ ),సీతారామరాజు(బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ )రామారావు(ఫిట్ సెక్రెటరీ,జె.వి.ఆర్ ఓసి),బాలాజీ( ఫిట్ సెక్రటరీ కిష్టారంఓసి) , నాగేశ్వరరావు(ఫిట్ సెక్రటరీ , జె.వి.ఆర్ సి.హెచ్.పి) , జే.వి.ఆర్ ఓసి అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు కోటి , సురేష్ , ఐ వి రెడ్డి , నాయకులు రాజశేఖర్సం, దీప్ , హరికుమార్ ,చాంద్ ,రఫీ ,రామచందర్, యాకూబ్ , మోహన్ , మురళి , నాగేందర్ , శ్రీధర్ , బాలకృష్ణ , రాము , ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comment List