రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం .....

బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం .....

బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మాజీ ఉప సర్పంచ్ చౌదరి గూడ మాగనోళ్ళ అనిల్ కుమార్

లోకల్ గైడ్ /జిల్లేడు చౌదరి గూడెం:హైదరాబాద్ లోని బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉప సర్పంచ్ మాగనోళ్ళ అనిల్ కుమార్  అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాస్త ప్రజా రోదనగా మారిందని, ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం రోజుకొక కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పాతేస్తారని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలం చెందిందని, దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News