నర్సరీల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలను పాటించాలి....

పలు గ్రామాలలోని నర్సరీలను ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్

నర్సరీల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలను పాటించాలి....

లోకల్ గైడ్ / జిల్లేడు చౌదరి గూడెం:నర్సరీల నిర్వహణలో ఫీల్డ్ అసిస్టెంట్లు సంబంధిత కూలీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులను చేపట్టాలని జిల్లేడు చౌదరి గూడెం మండల ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కోరారు. గురువారం మండల పరిధిలోని ఇంద్రానగర్, చౌదరి గూడెం, తూంపల్లి గ్రామాలలోని నర్సరీలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలు చేపడుతున్న పనులను, అలాగే మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపుదల అలాగే చేపడుతున్న విధానాన్ని కూలీలతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కూలీలతో మాట్లాడుతూ నర్సరీలలో పెంచుతున్న వివిధ రకాల మొక్కలను జాగ్రత్తగా కాపాడాలన్నారు. మట్టిని నింపే ప్యాకెట్లలో సారవంతమైన మట్టిని నింపేలా చూడాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అధికారులు సూచించిన నిబంధనలను పాటించాలని కూలీలకు సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేపట్టినట్లయితే చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ టెక్నికల్ అసిస్టెంట్ వినోద్ కుమార్, ఈసీ లక్ష్మారెడ్డి పంచాయతీ కార్యదర్శి నరేష్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News