ఇండ్ల సర్వే, నర్సరీల తనిఖీ...
ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్
By Ram Reddy
On
లోకల్ గైడ్ : మండల పరిధిలోని రావిరాల, గుంజల్ పహాడ్ గ్రామపంచాయతీలో నిర్వహించబడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే అలాగే నర్సరీలను మండల ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు .రావిరాల, గుంజల్పహాడ్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును వారు పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ సర్వే అధికారులకు పలు సూచనలు చేశారు .సర్వే కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కోరారు. నర్సరీలలో కూలీలు చేపడుతున్న పనులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఎంపీడీఓ కూలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఏపీఎం నర్సింలు ,పంచాయతీ కార్యదర్శి వివేక వర్ధన్, సుధాకర్, టెక్నికల్ అసిస్టెంట్ దేవోజి ,సర్వేర్లు పాల్గొన్నారు.
Tags:
Comment List