2025లో మరింత పురోగతి సాధిస్తాం...మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 2025లో మరింత పురోగతి సాధిస్తాం...మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

లోక‌ల్ గైడ్: తెలంగాణా రాష్ట్ర అభివృద్ధిలో 2024 సంవత్సరం ప్రత్యేకత చాటుకుందని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ఇదే సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ మేరకు మంగళవారం రోజున ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌదలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఇదే పారదర్శకతతో 2025 సంవత్సరంలో మరింత పురోగతి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనీ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం కలగలిపి సమపాళ్లలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు
అందుకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పదిలక్షల రూపాయల ఆరోగ్యశ్రీ లతో పాటు తెల్ల రేషన్ కార్డుదారులందరికి సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక అధ్యయాలుగా చరిత్ర లో నిలిచిపోయాయన్నారు.అంతే గాకుండా అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ,ముందెన్నడూ లేని రీతిలో సన్నాలకు 500 రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలుగా ఆయన అభివర్ణించారు.అంతే గాకుండా రెందులక్షల రైతురుణమాఫీ ఈ ప్రభుత్వంలో సువర్ణాద్యాయనన్నారు.ఖరీఫ్ సీజన్ లో దిగుబడి అయిన ధాన్యం యావత్ భారతదేశంలోనే రికార్డ్ సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల తీసుకున్న విధానాలకు అద్దం పడుతుందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి కింది స్థాయి కార్యకర్త వరకు సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు.సుప్రీంకోర్టు తీర్పుననుసరించి యస్సి వర్గీకరణ ఉంటుందన్నారు.
కులగణన చారిత్రాత్మక ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. తద్వారా వెనుకబడిన తరగతుల వారందరికీ మేలు జరుగుతుందన్నారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయాకట్టను సేద్యంలోకి తెచ్చే విదంగా నీటిపారుదల శాఖా ప్రణాళికలు రూపొందించుకుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.అన్నింటికీ మించి 5000 కోట్లతో 119 నియోజకవర్గ కేంద్రాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చెయ్యడం కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని ఆయన కొనియాడారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక కేశంపేట మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే  జన్మదిన వేడుక
లోకల్ గైడ్: కేశంపేట మండల కేంద్రంలో  బిజెపి నాయకుల ఆధ్వర్యంలో మహిళల కోసం మహిళల యొక్క హక్కుల కోసం చదువుల కోసం మరియు బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అలుపెరగని...
సారు కేశంపేట్ కు సర్వేరు రారా..
ఓ గురువర్యా! నీ స్థానమేక్కడ?
తొలి మహిళా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194 జయంతి
మహనీయుల స్ఫూర్తి,  ఆశయాలతో ముందుకు సాగాలి
రేషన్‌ కార్డులో మీ వాళ్ల పేర్లను చేర్చాలా.. అయితే ఇదే ప్రాసెస్ 
పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు..!