రోహిత్ శ‌ర్మ‌కు ఇక రిట‌ర్మెంట్ త‌ప్ప‌దా ...!

రోహిత్ శ‌ర్మ‌కు ఇక రిట‌ర్మెంట్ త‌ప్ప‌దా ...!

లోక‌ల్ గైడ్: వెనుకంజలో ఉన్న టీమిండియా.. కీలకమైన సిడ్నీ టెస్టులో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పక్కనపెట్టింది. మెల్‌బోర్న్‌ టెస్టులో పరాజయం అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు టీమిండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. సిడ్నీ టెస్టుకు హిట్‌మ్యాన్‌ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్లుగానే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రోహిత్‌పై వేటు వేసింది. కెప్టెన్సీ పగ్గాలను ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు అప్పగించింది. టాస్‌ సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్‌ బుమ్రా.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపాడు.
రోహిత్‌ భవితవ్యంపై ఊహాగానాలు..
సిడ్నీ టెస్టుకు రోహిత్‌ శర్మ దూరమైన నేపథ్యంలో టెస్టుల్లో అతని భవితవ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే హిట్‌మ్యాన్‌ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అమెరికా, వెస్టిండిస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను నెగ్గిన తర్వాత విరాట్‌తో పాటు రోహిత్‌ సైతం రిటైర్మెంట్‌ను ప్రకటించారు. తాజాగా టెస్టుల్లో కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొన్నది. ఇకపై రోహిత్‌ ఈ ఫార్మాట్‌లో కనిపించే అవకాశం లేదని.. రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉందని పలువురు మాజీ ఆటగాళ్లు పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు   దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు 
లోకల్ గైడ్:హైద‌రాబాదులోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సమైక్య ప్రారంభమైందని తొలి వెలుగు మహాసభలకు...
మ్యాగ్నెట్  ఆఫ్ ఎక్సలెంట్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్
నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ
.....ఓ శక్తి స్వరూపిణి...... 
నస్కల్లో వెల్లివిరిసిన మత సామరస్యం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి 
షాద్ నగర్ లో జ్యూస్ వరల్డ్ అండ్ పార్లర్ షాప్ ప్రారంభం