చైనాలో మరో మహమ్మారి..
లోకల్ గైడ్:చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ లక్షణాలు, ఎలా వ్యాపిస్తుంది, నివారణ చర్యలు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందిందని, కొవిడ్ వెలుగులోకి వచ్చిన సరిగ్గా ఐదేండ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతున్నదని స్థానిక, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ బారినపడి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం.
కోవిడ్ తరహా లక్షణాలే...!
ఈ వైరస్ సోకిన వారిలో కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తాయని తెలిసింది. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. వైరస్ తీవ్రమైతే బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి సమస్యలకు దారితీస్తుంది. మూడు లేదా ఆరురోజుల వరకూ లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి లక్షణాలు వేర్వేరు వ్యవధిలో ఉంటాయి.కరోనా మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఈజీగా సోకుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ దరి చేరకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చేతులను తరచూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కును కప్పుకోవడం.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, రద్దీ ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండడం వంటివి తప్పనిసరిగా పాటించాలి. తద్వారా వైరస్ వ్యాప్తిని కాస్తమేర కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
Comment List