మేడ్చల్ మున్సిపాలిటీ, ఉమ్మడి మండల ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ.
లోకల్ గైడ్: మేడ్చల్ మున్సిపాలిటీ,ఉమ్మడి మండల ప్రజలందరికీ మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు,ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, మీ అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని,ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని, వాటిని చేరుకునేలా ఒక ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. ఏర్పరుచుకున్న లక్ష్యాలను వచ్చే ఏడాది నాటికి చేరుకునేలా శ్రమించాలని కోరుకున్నారు, 2024వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ,2025 లోకి అడుగుపెడుతున్న వేళ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ " హ్యాపీ న్యూ ఇయర్"
Comment List