ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్త శాలరీ ఇదా!? జనాల ఆశ్చర్యం!

ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్త శాలరీ ఇదా!? జనాల ఆశ్చర్యం!

ఇంటర్నెట్ డెస్క్: ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశాభివృద్ధి కోసం ప్రత్యక్షంగా పనిచేసే అరుదైన అవకాశం. భారత దేశ పేరు ప్రతిష్ఠలను ఇనుమడింప చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల శాలరీ విషయంలో మాత్రం దేశ వాసులు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే, ఇస్రోలో ప్రాథమిక స్థాయిలో పనిచేసే యువ శాస్త్రవేత్తల శాలరీ అంశం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బ్రోక్ బ్రదర్స్ చేసిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా (Viral) మారింది.

స్ట్రీట్ ఇంటర్వ్యూలకు పెట్టింది పేరు బ్రోక్ బ్రదర్స్ ఛానల్. ఇందులో వ్యాఖ్యాతలు వీధుల్లో కనిపించే వివిధ రకాల వ్యక్తులను స్వల్పకాలిక ఇంటర్వ్యూలు చేస్తూ జనాలతో పంచుకుంటారు. ఆర్థిక అంశాలే ప్రధానంగా ఈ ఛానల్‌ను నిర్వహిస్తుంటారు. అయితే, తాజాగా వారు ఇస్రో శాస్త్రవేత్తను ఇంటర్వ్యూ చేశామని చెప్పారు. ఇక ఇంటర్వ్యూలోని వ్యక్తి మాట్లాడుతూ ఇస్రోలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్తల శాలరీ నెలకు లక్ష ఉంటుందని చెప్పుకొచ్చారు. సీటీసీ 15 లక్షల దాకా ఉండొచ్చని చెప్పుకొచ్చారు. ఇస్రోలో ఉద్యోగం పరంగా బాగా నచ్చే అంశం కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్ అని చెప్పుకొచ్చాడు. దీని ద్వారా మంచి ఆసుపత్రుల్లో ఉచితంగా ట్రీట్‌మెంట్ పొందొచ్చని అన్నారు

అయితే, జనాలు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ''ఇస్రో చైర్మన్ శాలరీనే నెలకు రెండున్నర లక్షలని ఎక్కడో చదివాను. అలాంటి ప్రాథమిక దశలోని శాస్త్రవేత్తకు లక్ష శాలరీ ఉంటుందా.. మహా అయితే.. నెలకు 55 వేలతో పాటు అదనపు అలవెన్సులు కొన్ని ఉండొచ్చు'' ఓ నెటిజన్ అని చెప్పుకొచ్చారు. దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న శాస్త్రవేత్తల శాలరీ మరింతగా పెంచాలని అనేక మంది డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం