భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు

భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు

లోకల్ గైడ్ :
సోమవారం వర్గల్ మండలంలోని  శాకారం గ్రామంలో  భూభారతి చట్టం 2025 పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మరియు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ లతో కలిసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ  సమాచార సంబంధాలశాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గజ్వేల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ ఆవరణలోని హెలి ప్యాడ్ లో హెలికాప్టర్ దిగిన మంత్రులకు జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు  పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా శాకారం గ్రామంలోని అవగాహన సదస్సు వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టర్ భూభారతి చట్టం 2025 పై క్లుప్తంగా వివరించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్లు:- దేశానికి ఒక రోల్ మోడల్ భూభారతి చట్టం 2025.ఈ చట్టం వెనుక  అందరి కృషి, శ్రమ ఉంది.సార్వత్రిక ఎన్నికల ముందు ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా  సహచర మంత్రులందరం  తెలియజేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంఇందిరమ్మ ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం.ఇది ఈ అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది.ధరణితో  ఇబ్బందులు కష్టాలు పడ్డ రైతుల కష్టాలు ఇక తీరుతాయి.నాలుగు గోడల మధ్య తయారు చేసిన ధరణితో రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారు.కానీ భూభారతి చట్టాన్ని 18 రాష్ట్రాల్లో పరిశీలించి ప్రజల ముందుకు తీసుకువచ్చి మేధావులు మేధమధనం చేసి, రిటైర్డ్ ఉద్యోగులు, అన్నదాతలు అందరి సలహాలు సూచనలు తీసుకొని  అసెంబ్లీలో చర్చించి అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చాము.దీనిని పగడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే.రెవెన్యూ అధికారులు కూడా రైతు కుటుంబాలనుండి వచ్చినవారే రైతులను ఇబ్బంది పెట్టకుండా కార్యాలయాల చుట్టూ తిప్పకుండా   ప్రభుత్వ రాజ్యం లక్ష్యం మేరకు  మీ మీ స్థాయిలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ అధికారులు సమస్యలు పరిష్కరించాలి.అధికారులు తప్పు చేస్తే శిక్షించే అధికారం ఈ చట్టంలో ఉంది.తాసిల్దార్ నుండి కలెక్టర్ వరకు జరిగిన నిర్ణయాలపై ఆర్డిఓ, జిల్లా కలెక్టర్ నుండి  సిసిఎల్ఏకు వరకు ఆపిల్ కు వెళ్లే అవకాశం ఉంది.రాష్ట్రంలో 4 జిల్లాల్లోని 4 మండలాల్లోని అన్ని రెవెన్యూ గ్రామాలలో పైలట్ ప్రాజెక్టుగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నాము. తాసిల్దార్ నేతృత్వంలో రెవెన్యూ టీం గ్రామాలకు వెళ్లి సదస్సులు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 30 వ తేదీలోగా పూర్తవుతాయి.వచ్చే నెల రెండు మూడు తేదీల నుండి రాష్ట్రంలోని మిగతా 29 జిల్లాల్లో ఒక్కో మండలంలోని  అన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా  అమలు చేస్తాం. ఏ ఒక్క రైతు ఆఫీస్ కు కానీ, కోర్ట్ కు గాని, ట్రిబ్యునల్ వెళ్లనవసరం లేదు. భూములు ఉండి అత్యవసరానికి ఎకరం, అరెకరం అమ్ముకుందామన్న  ఆనాడు ధరణితో ఇబ్బంది కలిగేది.నాడు సాదా బైనమాలను రెగ్యులర్ చేస్తామంటే  9 లక్షల 26,వేల మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒకరికి రెగ్యులరైజ్ కాలేదు. కానీ ఇప్పుడు సదా బైనమాలకు మోక్షం లభించనుంది.రాబోవు రోజుల్లో మనిషికి ఆధార్ లాగే రైతుల ఖాతా నెంబర్ ఇస్తాము అదే భూదార్ నెంబర్.ఆనాడు స్వార్థం కోసం రద్దు చేసిన వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ వలన రైతులు ఆసాములు ఎంతో ఇబ్బంది పడ్డారు. మంచి ఫలితాల కోసం వీఆర్వో వ్యవస్థను మళ్లీ తీసుకు వస్తాము.రెండు, రెండున్నర వారాల్లోనే  10956 గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తాము.త్వరలోనే భారీ మొత్తంలో సర్వేయర్లను నియమిస్తాము. లైసెన్స్ సర్వేయర్లను 6 వేల మందికి ట్రైనింగ్ మరియు లైసెన్స్ ఇచ్చి సర్వేకు ఉపయోగిస్తాము.3, 4 రోజుల్లోనే ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము. పేదలలో పేదలు ఇల్లు నిర్మించుకోవాలి.చిత్తశుద్ధితో పేదవారి కన్నీళ్లు తుడిచే ఇందిరమ్మ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ఇల్లు కాబట్టి మొదటి విడుతలో మంజూరయ్యే ఇండ్లను పేదలలో పేదలు నిర్మించుకోవాలి.

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
లోకల్ గైడ్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25, అవగాహన రెవెన్యూ సదస్సు మంగళవారం, దంతాలపల్లి మండల కేంద్రం...
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు
భూ వివాదాల పరిష్కారానికి 'భూభారతి' దోహదం:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలి
టిడిపి సభ్యత కార్డుల పంపిణీ 
ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia