గ్యాస్ అధిక ధరలపై వక్స్ సవరణ చట్టం రద్దు కై సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా
లోకల్ గైడ్ తెలంగాణ, మహబూబాద్ జిల్లా
అధిక ధరలు అరికట్టాలి, వక్స్ సవరణ చట్ట బిల్లు రద్దు చేయకపోతే మోడీపై పోరాటం తప్పదు.సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి డిమాండ్
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు టెంట్ ఏర్పాటుచేసి భారీ ధర్నా నిర్వహించడం జరిగింది, ఈ ఆందోళనకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అధిక ధరలు అరికట్టడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు మోడీ కేవలం కార్పొరేట్లకే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ వారినే పైకి తేస్తున్నాడని పిలుపునిచ్చారు, బిజెపి ప్రభుత్వం రానున్న కాలంలో పతనం కాక తప్పదు అన్నారు దేశంలో మత రాజకీయాలు కుల రాజకీయాలు చేస్తూ బిజెపి విద్వేషాలు పెంచుతుందన్నారు వక్స్ సవరణ చట్ట బిల్లు వెంటనే రద్దు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన కూడా మోడీకి బుద్ధి రావడం లేదని అన్నారు, దేశంలో ఉన్న కొంతమంది కార్పోరేట్ శక్తులకే మోడీ ఊడిగం చేస్తున్నాడని అంబానీ ఆదానీలకే బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని దుయ్యబట్టారు, ముస్లింల హక్కులు కాలరాస్తుంటే సిపిఐ ఊరుకోదని వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు సుప్రీంకోర్టుకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి బి రాజా వక్స్ సవరణ చట్టం బిల్లుపై కేసు వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ చేస్తున్న ధర్నాకు మైనార్టీ కమిటీ బాధ్యతలు సంఘీభావం తెలిపి ఆందోళనలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి అజయ్ సారధి రెడ్డి, కట్టే బోయిన శ్రీనివాస్, ముస్లిం కమిటీ బాధ్యులు ఎండి ఇక్బాల్ ఫరీద్ రియాజ్ ఆసిఫ్ ఇబ్రహీం ఇస్మాయిల్ రహీముద్దీన్ చాంద్ మరియు పెరుగు కుమార్ రేషపల్లి నవీన్ చింతకుంట్ల వెంకన్న చొప్పరి శేఖర్ సారిక శ్రీను జంపాల వెంకన్న ఎండి ఫాతిమా వెలుగు శ్రవణ్ ఎండి మహమూద్ తూటి వెంకటరెడ్డి ఆబోతు అశోక్ జనగం ప్రవీణ్ వంకాయలపాటి చిరంజీవి చీర వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Comment List