పరీక్ష భయం పోగొట్టేందుకే నమూనా పరీక్షలు.
మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబు.
విజయవంతమైన లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల ఎంసెట్ మోడల్ పరీక్ష.
లోకల్ గైడ్: విద్యార్థులలో పోటీ పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ముందస్తు మోడల్ పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల డైరెక్టర్లు మాగంటి ప్రసాద్ బాబు రమేష్ బాబులు అన్నారు. సోమవారం లిటిల్ ఫ్లవర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంసెట్ మోడల్ పరీక్ష పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంసెట్ మోడల్ పరీక్షలను నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మూడు దఫాలుగా ఈ మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షకు విద్యార్థుల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని 110 మంది విద్యార్థులు ఈ మోడల్ పరీక్షకు హాజరయ్యారని అన్నారు. విద్యార్థులు మానసిక ధైర్యంతో ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలకు హాజరు కావాలని తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రసాద్ బాబు రమేష్ బాబులు విద్యార్థులకు సూచించారు . ఎంసెట్ కోచింగ్ లో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే తయారుచేసిన ప్రశ్నాపత్రం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల గణితం అధ్యాపకులు ఎండి బషీర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comment List