దండకారణ్యం దద్దరిల్లుతుంది
లోకల్ గైడ్ :
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలు మావోయిస్టుల రక్తంతో ఎరుపెక్కాయి. తుపాకీ గుళ్ల వర్షం.. బాంబుల మోతతో కర్రెగుట్టలు మార్మో గుతున్నాయి. హెలికాఫ్టర్లు, డ్రోన్లు, అత్యాధునిక ఆయు ధాలతో వేల సంఖ్యలో భద్రతా దళాలు..ఆపరేషన్ కగార్‌తో ముందుకు సాగుతున్నాయి.మావోయిస్టులు-భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 37 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే మావోయిస్టుల మరణాల సంఖ్య మాత్రం భారీగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.నిర్విరామంగా కూంబింగ్ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ఆరో రోజుకు చేరింది. తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న కర్రెగుట్ట లో జరిగిన ఎన్‌కౌంటర్ లో భారీగా మావోయిస్టులు మృతిచెందారు.కర్రెగుట్టలో భద్రతా బల గాలు జరిపిన కాల్పుల్లో 37 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలు స్తోంది. గత కొన్ని రోజులు గా కేంద్ర పారామిలిటరీ బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగు తున్నాయి.ఈ కాల్పుల్లో ఇదివరకే ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందగా.. శనివారం ఆ సంఖ్య 37 కి చేరినట్లు తెలుస్తోంది. అధికారులు ఈ సంఖ్యను ధ్రువీకరించాల్సి ఉంది. 20 వేల మందితో జల్లెడ కర్రెగుట్టల్లో దాదాపు 1000 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అందడంతో వారి కోసం దాదాపు 20 వేల మంది సిబ్బందితో అడవిని జల్లెడ పడుతున్నారు.బలగాలతో పాటు డ్రోన్‌లు, హెలికాఫ్టర్‌ల సహాయంతో మావోయిస్టులపై బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం అందుతుంది. కర్రెగుట్టలపై భద్రతా బలగాల కాల్పులపై పౌర హక్కుల సంఘాలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నాయి. కర్రెగుట్టనే ఎందుకు టార్గెట్.. కర్రెగుట్ట ప్రాంతం మావోయిస్టులకు బలమైన స్థావరంగా ఉంది. ముఖ్యం గా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నంబర్ 1 ఇక్కడ ఎక్కువ గా సంచరిస్తుంటుంది. ఈ బెటాలియన్ మావోయిస్టు ల అత్యంత ప్రమాకరమైన సాయుధ విభాగాలలో ఒకటి.కర్రెగుట్ట తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఇది మావోయిస్టుల కు శిక్షణ కార్యకలాపాలు నిర్వహించడానికి అను కూలమైన ప్రదేశం. ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించడం వ్యూహాత్మకం గా ముఖ్యం అని పోలీసులు భావిస్తున్నారు.
Comment List