రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ యూనియన్ ఉద్యోగులు జేఏసీ కమిటీలు వేసుకోవాలి.
టీజేఏసీ రాష్ట్ర కో చైర్మన్ హనుమంతు ముదిరాజ్
లోకల్ గైడ్ :
తెలంగాణ రాష్ట్ర టిజిఎస్ ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థకు హామీ ఇచ్చింది. రాష్ట్ర ఉద్యోగులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా వినతిపత్రం అందజేయడం జరిగింది. అయిన ప్రభుత్వమే ఎంత మాత్రం పట్టించుకోకుండా సమస్యను పక్కదారి పాటిస్తున్న సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు వచ్చేనెల 7న రాష్ట్ర ఆర్టీసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టనుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ టిజేఏసీ కో చైర్మన్ కె .హనుమంత్ ముదిరాజు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ల వారిగా చేసి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.2021, 2025 సంవత్సర వేతన సవరణ బకాయిలు కారుణ్య నియామకాలు ప్రతిపాదికన జీతాలు,పెంచిన పని భారం తగ్గించుట, యజమాన్యం వేధింపులు, ప్రైవేటు బస్సులో డ్రైవర్లను ఆర్టీసీ ఉద్యోగులుగా తీసుకోవాలి .రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు తదితర సమస్యల పరిష్కార నేపథ్యంలో రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు వచ్చే నెల 7న సమ్మెలోకి దిగుతున్నారన్నారు. రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేసుకునే విధానం ప్రభుత్వంపై పోరాటం మరితవృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులు తక్షణమే జెఎసి కమిటీలు ఏర్పాటు చేసుకొని సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగులను కోరారు.
Comment List