శ్రీలంకపై భారత్ అమ్మాయిల తొలి గెలుపు
లోకల్ గైడ్ :
అమ్మాయిల తొలి విజయం.. శ్రీలంకపై భారత్ గెలుపు ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు.. ఆతిథ్య శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.కొలంబో: ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు.. ఆతిథ్య శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకే కుదించగా.. భారత స్పిన్నర్లు స్నేహ్ రాణా (3/31), దీప్తి శర్మ (2/22) రాణించి లంకను 38.1 ఓవర్లలో 147 పరుగులకే కట్టడిచేశారు.ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/26) అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టింది. యువ పేసర్ కాశ్వీ గౌతమ్ వికెట్లేమీ తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. లంక బ్యాటర్లలో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్. ఛేదనలో టాపార్డర్ బ్యాటర్లు ప్రతీక రావల్ (50 నాటౌట్), హర్లీన్ డియోల్ (48 నాటౌట్), స్మృతి మంధాన (43) మెరవడంతో లక్ష్యాన్ని భారత్.. 29.4 ఓవర్లలో పూర్తిచేసింది. ప్రతీకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో భారత్.. మంగళవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Comment List