జమ్ముకశ్మీర్ అసెంబ్లీ పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళి
లోకల్ గైడ్ :
పహల్గాం ఉగ్రదాడి మృతులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నివాళులు JK Assembly | ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించింది. JK Assembly : ఈ నెల 22న పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ (Baisaran) లోయలో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన క్రూరమైన దాడిలో మరణించిన పర్యాటకులకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ (JK Assembly) నివాళులు అర్పించింది. వారి మరణాలపట్ల సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గత మంగళవారం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. వారిలో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్ జాతీయుడు ఉన్నారు.ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉగ్రదాడిపై సభలో చర్చించారు. అనంతరం మృతులకు నివాళి అర్పించారు. ఓ ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కునే క్రమంలో తూటాలకు బలైన స్థానికుడి త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. ఆపై ఉగ్రదాడిని ఖండిస్తూ ఒక తీర్మానం చేశారు.
Comment List