ఆమోదం పొందిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.
లోకల్ గైడ్ :
జిల్లాలో ఆమోదం పొందిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆమోదం పొందిన దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలలో ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ రుసుములో 25 శాతం రాయితీ కల్పించిదన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులంతా రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలని తెలిపారు. ఏప్రిల్ 30 వ తేదీతో ఈ రాయితీ అవకాశం ముగుస్తుందన్నారు. కావున దరఖాస్తుదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన రుసుములు చెల్లించాలని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Comment List