మహాత్మా జ్యోతి బాపూలే ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహాత్మా జ్యోతి బాపూలే ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహాత్మా జ్యోతి బాపూలే ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, లోకల్ గైడ్ తెలంగాణ 

హక్కుల కోసం పోరాడిన మహాత్మా జ్యోతి బాపూలే బలహీన వర్గాలకు ఆత్మ స్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాఫూలే 199వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి జ్యోతి వెలిగించి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ తో పాటు వివిధ సంక్షేమ సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతి బాఫూలే జీవిత చరిత్రను వివరిస్తూ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడిన మహానీయుడు మహాత్మా జ్యోతి బాపూలే అని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఉద్యమకర్త, సంఘసేవకుడు, సామాజిక తత్వవేత్త, మహిళా అభ్యుదయ వాది, నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన మహాత్మ జ్యోతి భాఫూలేను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి, వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. ఆయనను స్మరించుకోవడం ప్రతి ఒక భారతీయుడి బాధ్యత అని అన్నారు. 

ఈ కార్యాక్రమంలో బి.సి. డెవలప్మెంట్ అధికారి ఎం. నరసింహస్వామి, మైనారిటీ శాఖ అధికారి శ్రీనివాస్, జెడ్.పి సీ.ఈ.ఓ పురుషోత్తం, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ అధికారి విజయ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు మదన్ మోహన్, వినోద్, కుల సంఘాల నాయకులు కామా సంజీవరావు, కిషన్ నాయక్ బోడ లక్ష్మణ్ నాయక్, పొన్నాల యుగంధర్, చిత్తారి సోమన్న, సూర్య ప్రకాష్, సాయికుమార్, పింద్రాల రాందాస్, మంద శశి, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్ చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ...
అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
తెలంగాణ రాష్ట్రం గవర్నర్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.
డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే