ఛేద‌న‌లో మ‌ళ్లీ చేతులెత్తేసిన చెన్నై

ఛేద‌న‌లో మ‌ళ్లీ చేతులెత్తేసిన చెన్నై

లోక‌ల్ గైడ్:

ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌ మ‌ళ్లీ గెలుపు బాట ప‌ట్టింది. ముల్ల‌నూర్ మైదానంలో ప్రియాన్ష్ ఆర్య‌(103) మెరుపు సెంచ‌రీతో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. మాజీ ఛాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను 201కే క‌ట్టడి చేసింది. ఈ సీజ‌న్‌లో 190 ప్ల‌స్ ల‌క్ష్యాన్ని ఛేదించ‌ని సీఎస్కే మ‌ళ్లీ విఫల‌మైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే(69 రిటైర్డ్ హ‌ర్ట్), ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ శివం దూబే(42) పోరాడారు. ఆఖ‌ర్లో ఎంఎస్ ధోనీ(22) ధనాధ‌న్ ఆడినా ఓట‌మి త‌ప్పించ‌లేక‌పోయాడు. బౌలింగ్‌లో భారీగా పరుగులిచ్చిన చెన్నై.. బ్యాటింగ్‌లో ఉతికారేయ‌లేక‌ వ‌రుస‌గా మూడో ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News