జగమంతా శ్రీరామమయం
జగమంతా శ్రీరామమయం
------------------------------------
శ్రీ రామ జయరామ
జయ జయ రామ
భక్తుల కోరికలు తీర్చే రామ
నిన్ను తలవని భక్తుడుండునా
శ్రీ రాముని గుడి లేని
ఊరు ఉండునా ఓ రామా...
ఓ రామయ్య నీవేనయ్యా
మాకు అండ దండ నీవే
ప్రతి గుడిలో శ్రీ రాముని
కళ్యాణం ఘనంగా జరిగే
భక్తులకు మార్గదర్శకుడు
ఆ శ్రీ సీతారాముడే...
శ్రీ సీతారాములే
అన్యోన్య దంపతులు
శ్రీ రామలక్ష్మణులే
అపురూప సోదరులు
శ్రీ రాముడి అచంచలమైన
భక్తుడే హనుమంతుడు...
గుహుడు,సుగ్రీవుల
మైత్రి బంధం రుచి
చూసిన పళ్ళను పెట్టిన
శబరి ఆతృతే ఆత్రుత
శ్రీ రామా మీ బాణం
శక్తికి తార్కాణాలు ఎన్నెన్నో...
ధర్మ పాలన ధర్మరక్షణ
మిత-ప్రియ భాషణ
కష్టాలకు చెదరని మనో
నిబ్బరత నీదేనయ
లక్ష్యసాధనలో అకుంఠిత
కార్యాచరణ దీనబంధువు
ప్రజారక్షణలో అపరిమిత
కారుణ్యం గల దేవుడవు...
మా మనస్సు మదిలో
మీ నామస్మరణ
మీ నామ కీర్తన మాకు
సదా శ్రీ రామా రక్షణ
మము సదా కాపాడు
ఓ లోకరక్షకా శ్రీ రమా
మీ నామస్మరణే
తొలగించును కష్టాలను...
రామ కీర్తనలు సంతోషాన్నిచ్చును
భక్తకోటికి రామనామమే
తారక మంత్రమగును
ఓ జగదభి రామ ఓ
శ్రీ కోదండ రామయ్య...
🙏🏻🙏🏻
వి.జానకి రాములు గౌడ్
Comment List