గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఎలుక!..

గిన్నిస్ రికార్డ్ సృష్టించిన ఎలుక!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఒక ఎలుక మన ఇంట్లో ఎక్కడ కనపడినా దాన్ని చంపే వరకు మనం వదిలిపెట్టం. కానీ ఎలుక యొక్క తెలివి, తన మైండ్ తో ఒక దేశాన్ని కాపాడగలిగిందంటే మీరు నమ్ముతారా?.. అయితే తాజాగా బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక పేరు రోనిన్. ఈ ఎలుకకు బాంబులు గుర్తించడమే పని. ఇప్పటివరకు ఈ ఎలుక భూమిలోని 109 ల్యాండ్ మైన్లు, 15 బాంబులు గుర్తించి రికార్డు సృష్టించింది. ఎన్నో ప్రమాదాలను  కాపాడిన ఎలుకను ఆ దేశ ప్రజలు హీరోగా కీర్తిస్తున్నారు.  అయితే ఈ రోనిన్ అనే ఎలుక ముందు మగవా అనే ఎలుక దాదాపు 71 మైన్లు అలాగే 38 బాంబులను గుర్తించింది. దీంతో సమాదాలను ముందుగానే గుర్తించే రోనిన్ అనే ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీంతో ఆయా దేశాల ప్రజలు ఈ రోనిన్ అని ఎలుకను సోషల్ మీడియా వేదికగా హైలెట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక పేలుడు పదార్థాలను గుర్తించిన ఎలుకగా రోనిన్ అనే ఎలుక రికార్డ్ సృష్టించింది. Screenshot_2025-04-07-18-18-13-914_sun.way2sms.hyd.com-edit

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News