ఇంగ్లాండ్ కెప్టెన్ గా ఎన్నికైన హ్యారీ బ్రూక్

ఇంగ్లాండ్ కెప్టెన్ గా ఎన్నికైన హ్యారీ బ్రూక్

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఇంగ్లాండ్ కెప్టెన్ గా   హ్యారీ బ్రూక్ నియమితమయ్యారు. తాజాగా జోష్ బట్లర్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్  బ్రూక్ కు కెప్టెన్  బాధ్యతలను అప్పగించింది. ఇంగ్లాండ్ తరఫున వన్డే మరియు టి20 లకు  హ్యారి బ్రూక్ కెప్టెన్గా వ్యవహరిస్తారని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే దేశం కోసం ఆడేందుకు బ్రూక్ఈ  ఏడాది  నుంచి కూడా వైదొలిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్రూక్ ను  6.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. కానీ అనూహ్యంగా ఐపీఎల్ నుంచి బ్రూక్ తప్పుకున్నారు. దేశానికే క్రికెట్ పరంగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని బ్రూక్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయంతో బ్రూక్ పై ఐపీఎల్ రెండు సంవత్సరాల పాటు నిషేధం విధించింది. జోష్ బట్లర్ ఇంగ్లాండ్ తరఫున కెప్టెన్గా వ్యవహరించినప్పటి నుంచి ఇంగ్లాండ్ టీం సరిగా ఆడక పోవడంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బ్రూక్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. download (3)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News