సూర్యకుమార్ యాదవ్ కు మరో అరుదైన ఘనత
లోకల్ గైడ్ :
ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ముంబయిలోని వాఖండే స్టేడియంలో సోమవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఘనత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో గెలిచి.. ఈ సీజన్లో ముంబయి తొలి విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌కు ఇది రెండో ఓటమి కాగా.. పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆకట్టుకున్నారు. తొమ్మిది బంతుల్లో మూడు బౌండరీలు, రెండు సిక్సర్ల సహాయంతో 27 పరుగులు చేశాడు.దాంతో టీ20 క్రికెట్లో అరుదైన ఫీట్‌ని అందుకున్నాడు. టీ20 8వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. టీ20ల్లో సూర్యకుమార్ 8వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్స్ సరసన నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా ముందున్నారు. 288వ టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో విరాట్ ముందున్నాడు.
Comment List