శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాలు

లోకల్ గైడ్ :
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు..ఉగాది మహోత్సవాలకు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.శ్రీశైలం : ఉగాది మహోత్సవాలకు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు విశాలమైన తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కైలాసద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేయాలన్నారు. ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలిక పైప్‌లైన్ ద్వారా మంచినీరు అందజేస్తున్నట్లు తెలిపారు.కాగా ఈ ఏర్పాట్ల పరిశీలన భాగంగా శుక్రవారం కార్యనిర్వహణాధికారి వారు సంబంధిత ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగ అధికారులతో కలిసి కైలాసద్వారం, భీమునికొలను మెట్లమార్గం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా హటకేశ్వరం, సాక్షిగణపతి వద్ద కూడా ఆయా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఎటువంటి అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా ఉండాలన్నారు. అధికారులందరూ కూడా పరస్పర సమన్వయంతో ఆయా ఏర్పాట్లలలో నిమగ్నం కావాలన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List