రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఆర్థిక చేయూత

రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఆర్థిక చేయూత

•గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అధిక నిధులు కేటాయిస్తుంది.
•అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు.
•ఎస్సీ వర్గీకరణ, బిసి రిజర్వేషన్ల ద్వారా వారి దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది.
•రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.

లోకల్ గైడ్ తెలంగాణ:
గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పరిధిలో లక్ష్మీనరసింహపురం, కోడిపుంజుల తండా, మొట్ల తిమ్మాపురం, కోటగడ్డ, కొత్తగూడెం మండలం గాంధీ నగర్  గ్రామాలలో అంతర్గత రోడ్లు, బ్రిడ్జిలు, పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య,  జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండలంలోని లక్ష్మీనరసింహాపురంలో మూడు కోట్లతో నిర్మాణం, కోడిపుంజుల తండా లో కోటి 50 లక్షలతో అభివృద్ధి పనులు రోడ్ల నిర్మాణం,  మొట్ల తిమ్మాపురం లో రెండు కోట్ల తో వంతెన నిర్మాణం, కోట గడ్డ లో 4.72 లక్షలతో రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు పట్టణాలు అనే తేడాలు లేకుండా అభివృద్దె ధ్యేయంగా పనిచేస్తుందని అందులో గిరిజన గ్రామాల ప్రజలు సౌకర్యార్థం అంతర్గత రోడ్ల నిర్మాణం విద్య, వైద్యం, ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు చేయూతను అందించడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 పైచిలుకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, యువ వికాసం పథకం కింద నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల యువతకు నాలుగు లక్షల ఆర్థిక చేయూతను అందించడం జరుగుతుందని, మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్దిక భరోసా కల్పిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సర్వీసులను కల్పిస్తూ, అండగా ఉంటున్నామని, ఐటిడిఎ పరిధిలోని గిరిజన గ్రామాలలో సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు వివిధ సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.రైతు భరోసా, రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.కొత్తగూడెం మండల కేంద్రంలోని గాంధీ నగర్ లో గిరిజన ఆశ్రమ సంక్షేమ ఉన్నత పాఠశాల కాలేజిలో జగతి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్లను అందజేశారు. ఆసక్తితో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. రైతు వేదికలో ఆడపిల్లలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వాటి ద్వారా ఆడపడుచులు గౌరవప్రదంగా ఉందన్నారు.కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి, ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, జిల్లాలోనీ తన నియోజకవర్గం లో అంతర్గత రోడ్ల, నిర్మాణం ,వంతెనల నిర్మాణం వివిధ అభివృద్ధి పనులకు సుమారు 10 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయడం సంతోషకరంగా ఉందని, బయ్యారం పెద్ద చెరువును ఆధునికరించాలని, నియోజకవర్గ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్, రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, సంబంధిత ఉన్నత అధికారులు, మూల మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Post Comment

Comment List

Latest News

 ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ ఎల్‌వోసీ వ‌ద్ద క్వాడ్‌కాప్ట‌ర్‌ను కూల్చివేసిన పాకిస్థాన్ ఆర్మీ
లోకల్ గైడ్: భార‌త్‌కు చెందిన క్వాడ్‌కాప్ట‌ర్‌ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వ‌ద్ద ఎయిర్‌స్పేస్ ఉల్లంఘించిన‌ట్లు పాక్ ఆరోపించింది. మ‌రో వైపు ఓ దౌత్య‌వేత్త‌తో పాటు ఏడుగురు...
Telangana Village Songs | Latest Folk Songs #shorts #latestfolksongs #pallepatalu #lgmedia
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview |Pallavi Prashanth
రాముడి వంశ వృక్షం గురించి ఈ బాబు ఎంత చక్కగా వివరించాడో చూడండి | Lord Rama Family Tree | LG Films
కొడుకు కల నెరవేర్చేందుకు భూమి విక్రయించిన తండ్రి..
మనం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి.
దుర్గా మల్లేశ్వర స్వామి గా శివుడు..!